ఉరవకొండ: పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని నిరసన కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏపీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు అనంతపురం జిల్లా ఉరవకొండలో భిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హనుమంతురాయడు కుల్లాయిస్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేస్తామని రూ.10700 కోట్లు విడుదల చేయలేదన్నారు.