రాప్తాడు: ఏప్రిల్ 23న ఏపీ ఈసెట్ 2026 పరీక్షల నిర్వహించబోతున్నాము చిన్మయి నగర్ లో జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో మంగళవారం 11 గంటల సమయంలో జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ 2026 పరీక్షలు నిర్వహించబోతున్నామని గత నెల 28 వరకు ఆన్లైన్ ద్వారా 33,751 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్కు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని 94 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబోతున్నామని ఈ పరీక్షలకు హాజరయ్య విద్యార్థినిలును ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.