కంగ్టి: నారాయణఖేడ్: పాఠశాల అటెండర్ల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి
కంగ్టిలో జరిగిన సమావేశంలో టీయూసీసీ నాయకుడు చిరంజీవి మాట్లాడుతూ, పాఠశాల అటెండర్ల వేతనాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.