సంగారెడ్డి: సంగారెడ్డిలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం
సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ, విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లకు బదులుగా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.