ఉరవకొండ: ఏపీ దర్శన్ లో భాగంగా అనంతపురం జిల్లా లోని జీడిపల్లి రిజర్వాయర్ పర్యటనకు వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ల బృందం
ఏపీ దర్శన్ లో భాగంగా అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ల బృందం బుధవారం బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ ను పరిశీలించారు. మండల తహసిల్దార్ అనిల్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ల బృందానికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. రిజర్వాయర్ పంపు హౌస్ పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో వసంత బాబు,తహసీల్దార్లు రిజర్వాయర్ రెవిన్యూ రికార్డు స్థితిగతులను వివరించారు. హంద్రీ నీవా చీఫ్ ఇంజనీర్ నాగరాజ జీడిపల్లి రిజర్వాయర్ నీటి సామర్థ్యం , ఎత్తిపోతల వివరాలు, విస్తీర్ణం, హంద్రీనీవా మొదటి రెండవ దశ వివరాలను అసిస్టెంట్ కలెక్టర్ల బృందానికి వివరించారు.