రాప్తాడు: సనప గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో సోమవారం 9:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ సనప గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని అదే విధంగా 80 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును కూడా ప్రారంభించడం జరిగిందని భవిష్యత్తులో ఆత్మకూరు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది టీడీపీ నేతలు పాల్గొన్నారు.