కనిగిరి: పట్టణంలోని గార్లపేట రోడ్డులో 100 KV నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన విద్యుత్ శాఖ అధికారులు
కనిగిరి పట్టణంలోని గార్లపేట రహదారిలో శనివారం 100 KV నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ... పట్టణంలో విద్యుత్ లో వోల్టేజి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన 100 కేవీ నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బొగ్గులగొంది కాలనీ పరిసర ప్రాంతాలలో విద్యుత్ లో వోల్టేజి సమస్యను పరిష్కరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.