ఉరవకొండ: అంగన్వాడీ కేంద్రాల్లో మూడు సంవత్సరాల పైబడిన చిన్నారులను చేర్పించండి :సీడీపీఓ శ్రీదేవి
గ్రామాల్లో మూడు సంవత్సరాల పైబడిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఉరవకొండ డివిజన్ సిడిపిఓ శ్రీదేవి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని హనిమ రెడ్డి పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సీడీపీఓ పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో IVRS కాల్స్ గురించి తల్లులకు అవగాహన కల్పించడం చేయడం జరిగింది. అనంతరం చిన్నారులు వారి తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధానంగా నేను చిప్స్, కూల్‌డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి జంక్ ఫుడ్స్‌ను తగ్గిస్తాను.పండ్లు, కూరగాయలు, పాలు, ఇంట్లో వండిన ఆహారం వంటి పోషకాహారాన్ని ఎంచుకుంటాను. జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరమన్నారు.