శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: రైతాంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: రైతు సంఘం నేత ఈశ్వరయ్య డిమాండ్
నెల్లూరు జిల్లా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని.. రైతు సంఘం నేత ఈశ్వరయ్య అన్నారు. నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం అయన మీడియాతో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు