రాప్తాడు: కురుగుంటలో దళితులకు వెంటనే సర్వే చేసి ఇళ్ల పట్టాలు కేటాయించాలి అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాప్తాడు MRPS దాస్
అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఒకటిన్నర గంటల సమయంలో రాప్తాడు బిసిఆర్ దాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కురుగుంటలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు సంబంధించిన కరపత్రాలను వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మార్పీఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్ మాట్లాడుతూ కురుగుంట గ్రామంలోని పద్మశ్రీ మందకృష్ణ మాదిగి కాలనీ వద్ద సర్వే చేసి దళితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని మందకృష్ణ మాదిగ కాలనీ బోర్డు తొలగించిన నిందితులను కఠినంగా శిక్షించాలని వీటిని అన్నిటి పైన పోరాటం చేసేందుకు వాల్ పోస్ట్ లు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని ఎమ్మార్పీఎస్ దాస్ పేర్కొన్నారు.