సంతనూతలపాడు: రబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు శనివారం రూ.12,10,702 లు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పొందిన లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.