సంతనూతలపాడు: చీమకుర్తి మండలం అగ్రహారంలో దారుణ ఘటన, ముగ్గురు కుమార్తెలకు విషం ఇచ్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి
చీమకుర్తి : ఓ తండ్రి తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపడమే కాకుండా తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన చీమకుర్తి మండలం అగ్రహారంలో శుక్రవారం వెలుగు చూసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అగ్రహారానికి చెందిన ఏ కుల సుధాకర్ అనే వ్యక్తి తన కుమార్తెలైన గోచిత (13), పూజిత (11), లోకి తశ్రీ (8) లకు విషమిచ్చి చంపాడు. అనంతరం తన ఇంటికి వెనుక వైపున ఉన్న పొలాల్లో సుధాకర్ సైతం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ,ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.