కనిగిరి: పట్టణంలో పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో
కనిగిరి: పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ కనిగిరిలో సిపిఐ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్థానిక చర్చి సెంటర్లో సిపిఎం నాయకులు కేశవరావు, సిపిఐ నాయకులు యాసిన్ మాట్లాడుతూ... కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, సామాన్య ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి అన్నారు. నిత్యవసర ధరలతో పాటు, వంటగ్యాస్, పెట్రో ధరలు తెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.