కొండపి: సింగరాయకొండ 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియ నివాహనం ఢీకొని జింక మృతి, దహన సంస్కారాలు చేసిన అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని 16 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పెట్రోలింగ్ చేస్తున్న హైవే పోలీసులు అటవీ శాఖ మరియు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చనిపోయిన జింకని ఓ వాహనంలో స్థానిక పశువైద్య శాఖ కార్యాలయానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం జింకకు దహన సంస్కారాలు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.