సంతనూతలపాడు: చీమకుర్తి మండలం రామతీర్థం గ్రానైట్ క్వారీలో ప్రమాదం, జెసిబి యంత్రంపై గ్రానైట్ రాయి పడి జెసిబి ఆపరేటర్ మృతి
చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద ఉన్న గ్రానైట్ క్వారీలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. జెసిబి యంత్రంతో గ్రానైట్ రాయిని తొలగిస్తుండగా ,గ్రానైట్ రాయి ఒక్కసారిగా జెసిబి యంత్రంపై పడిపోయింది. జెసిబి యంత్రంపై గ్రానైట్ రాయి పడిన నేపథ్యంలో జెసిబి ఆపరేటర్ మృతి చెందాడు. వెంటనే స్పందించిన యాజమాన్యం వేరొక జెసిబి యంత్రాలను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి ప్రమాదం జరిగిన జెసిబి పై పడిన రాయిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.