ఉరవకొండ: తాపీ మేస్త్రీలు గృహ నిర్మాణ కార్మికులకు నిర్మాణ పనుల జాగ్రత్తలపై ప్రొజెక్టర్ సాయంతో అవగాహన కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో తాపీ మేస్త్రి పనులు నిర్వహించే వారికి తమ తమ పనుల పట్ల నిర్వహణలో జాగ్రత్తలపై భారతి సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఇంజనీర్ మోతిలాల్ నాయక్ మంగళవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. తాపీ మేస్త్రిలు చెపట్టే పనులు జాగ్రత్తలపై ప్రొజెక్టర్ సాయంతో క్షేత్రస్థాయి అవగాహన కల్పించి భారతి సిమెంట్ పూర్తిగా రోబోటిక్ టెక్నాలజీతో తయారి విధానాలను పూర్తిగా ట్యాంపర్ ప్యాకింగ్లను ఆ కంపెనీ ఇంజనీర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డీలర్ ప్రతాపరెడ్డి, తాపీ మేస్త్రీలు, గృహ నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.