సంతనూతలపాడు: చీమకుర్తిలో రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
చీమకుర్తి పట్టణంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత బస్సు పథకం శ్రీ శక్తితో రద్దీ పెరిగిపోతుంది. ఆదివారం వంటి సెలవు రోజుల్లో అయితే చీమకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాప్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది .బస్సుల కోసం బస్టాప్ వద్ద ప్రయాణికులు వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది .ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు చీమకుర్తిలో రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.