రాప్తాడు: జి కొత్తపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన చింతలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నాలుగు గంటల 35 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నేత చింతలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ జి కొత్తపల్లి గ్రామానికి చెందిన టిడిపి నేత చింతలయ్య కొన్ని రోజుల క్రితమే అనారోగ్యంతో మరణించడం జరిగిందని ఈరోజు టిడిపి నేతలతో చింతలయ్య చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల క్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగిందని భవిష్యత్తులో టిడిపి నేత చింతలయ్య కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.