కనిగిరి: అడ్డ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం, టిప్పర్, డీసీఎం లారీ ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
కనిగిరి మండలం అడ్డరోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్, డీసీఎం లారీ వేగంగా వచ్చి పరస్పరం ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే స్పందించిన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సందీప్ సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.