రాప్తాడు: కక్కలపల్లి పంచాయతీలు ఒక కోటి 35 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి పంచాయతీ ఇంద్రజిత్తు నగర్ కాలనీ నందు ఒక కోటి 35 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఇంద్రజిత్తు నగర్ మబ్బు కొట్టాలు గౌతమి విలాస్ తదితర కాలనీ కు వెళ్లేందుకు ఒక కోటి 35 లక్షల రూపాయలతో మూడు సిసి రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో రోడ్డు లేని ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు నిర్మాణం చేపడతామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలు పాల్గొన్నారు.