కనిగిరి: నియోజకవర్గంలో వైసిపిని బలోపేతం చేయాలి: ఒంగోలు పార్లమెంట్ వైసిపి ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
కనిగిరి పట్టణంలో ఒంగోలు పార్లమెంట్ వైసిపి ఇన్చార్జి మరియు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ , వైసిపి నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గం లో వైసీపీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. వైసిపి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తో కలిసి పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేసే గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.