కనిగిరి: పట్టణంలోని వైద్యశాలలో నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రం, అదనపు గదుల నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రం మరియు అదనపు గదుల నిర్మాణ పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదివారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ న ఎమ్మెల్యే ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ బాధితులకు అధునాతన వసతులతో పాటు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.