కనిగిరి: పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్
కనిగిరి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాలలోని రికార్డులను మరియు గోడౌన్లలో ఎరువుల స్టాకులను ఆయన పరిశీలించారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే ఎరువులు దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏడిఏ హెచ్చరించారు. ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ చేయవద్దని, నకిలీ ఎరువు, పురుగుమందులను విక్రయించే దుకాణాల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.