సంతనూతలపాడు: టిడిపి మినీ మహానాడు పై పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ బుధవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18, 19 ,20 తేదీల్లో సంతనూతలపాడులో నిర్వహించే టిడిపి మినీ మహానాడు ను విజయవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని మండలాలలో అన్ని గ్రామాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చేలా పార్టీ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.