కనిగిరి: పట్టణంలోని పాతూరులో తాగునీటి పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి వృధాగా పోతున్న తాగునీరు, పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కనిగిరి పట్టణంలోని పాతూరులో గత రెండు ,మూడు రోజులుగా మంచినీటి పైప్ లైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో పైప్లైన్ల గుండా తాగునీరు వృధాగా పోతుంది. వేసవిలో అసలే నీటి కోసం ఓవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, తాగునీటి లీకేజీలను అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వెంటనే లీకేజీలను అరికట్టి తాగునీరు వృధా పోకుండా చూడాలని కోరుతున్నారు.