ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్పించండి: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెద్దఎత్తున చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కాగా, బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లు, ఎన్రోల్మెంట్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంతమంది విద్యార్థులు పాఠశాలలో చేరారు, ఆరో తరగతి, ఏడవ, తరగతి వారిగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఎంతమంది వచ్చారు, తదితర వివరాలు ఆరా తీసి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లను కలెక్టర్ పంపిణీ చేశారు.