రాప్తాడు: కనగానపల్లి మండల కేంద్రంలో రెడ్డివారి కుంట చెరువును మరమ్మతు పనులను పరిశీలించిన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కనుగానపల్లిలో రెడ్డివారి కుంట చెరువు మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ కనుగానపల్లి మండల కేంద్రంలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రెడ్డివారి కుంట చెరువు మరమ్మత్తు పనులను పరిశీలించి వేగంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగిందని అదేవిధంగా శ్రీనాథ్ పొలంలో వేరుశనగ పంటను కూడా పరిశీలించడం జరిగిందని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు