కనిగిరి: పట్టణంలో విద్యుత్ షాక్ కొడుతున్న ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం మిషన్, సమస్యను పట్టించుకోని బ్యాంక్ అధికారులు
కనిగిరిలోని ICICI బ్యాంక్ ATM మిషన్ బుధవారం షాక్ కొడుతూ ఉండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.క్యాష్ విత్ డ్రా చేయడానికి మెషీన్ పై చేయి పెట్టాలంటే కరెంట్ షాక్ కొడుతోందన్నారు. ఒక మెషీన్ పనిచేయడంలేదని, మరో మెషీన్ షాక్ కొడుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా సమస్య ఉన్నా బ్యాంక్ అధికారులు పరిష్కరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి