రాయదుర్గం: గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు : టిడిపి పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి
రాయదుర్గం పట్టణంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పట్టణ టీడీపీ అధ్యక్షుడు బండికృష్ణమూర్తి అన్నారు. శనివారం పట్టణంలోని 26, 28 వార్డుల్లో వార్డు ఇన్‌ఛార్జ్‌లు ఇనాయత్, పొరాళ్ల ధనరాజు, కాంబ్లి రాజశేఖర్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి జిలాన్ తదితరులతో కలిసి పర్యటిస్తూ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అలాగే ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యపై బోరును రిపేర్ చేయించి, సిస్టమ్ ట్యాంక్‌ను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరారు.