సంతనూతలపాడు: నాగులుప్పలపాడు లో మోటర్ బైకును ఢీ కొట్టిన కారు, ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
నాగులుప్పలపాడు: మోటార్ బైకును కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన నాగులుప్పలపాడు లో మంగళవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగులుప్పలపాడు లో వేగంగా వెళ్తున్న కారు మోటర్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.