కొత్తగూడెం: కొత్తగూడెంలో ఘనంగా మత సామరస్య దినోత్సవం: పిలుపునిచ్చిన సిపిఐ నేతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ జయంతి, మత సామరస్య దినోత్సవం నిర్వహించారు. దేశ సమగ్రతను, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు సూచించారు.