ఉరవకొండ: నరసాపురం లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామంలో మండల ఎంఈఓ లు గోవిందరాజులు, హరికృష్ణ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసి శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అధికారులు కోరారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకొని విధంగా వసతులు కల్పించడం జరిగిందని, విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ లు పుస్తకాలు బ్యాగులు మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుందని ఎంఈఓ లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు బాలాజీ, వరలక్ష్మి పాల్గొన్నారు