సంతనూతలపాడు: చీమకుర్తి మండలం గోనుగుంటలో విషాదం, నీటి కుంటలో పడి వ్యక్తి మృతి
చీమకుర్తి: నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామంలో ఆదివారం వెలుగు చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోనుగుంట గ్రామ సమీపంలోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు గొర్రెపిల్లలు పడిపోగా వాటిని రక్షించబోయి సుధాకర్ అనే వ్యక్తి నీటి కుంటలో పడి మృతి చెందాడు. స్థానికులు కృతదేహాన్ని వెలికి తీశారు. సుధాకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.