కొండపి: సింహాచలంలో గోడ కూలి మృతి చెందిన మృతులకు సంతాపం తెలిపిన మంత్రి స్వామి
సింహాచలం ఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి స్వామి అన్నారు. చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా టంగుటూరు మండలంలోని పాలెం లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అధికారులు నెల రోజులపాటు శ్రమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించినా, అకాల వర్షానికి ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.