కనిగిరి: లింగారెడ్డిపల్లి లో VB-G RAM -G కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
కనిగిరి మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి వి బి జి, రామ్ జి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వి బి జి, రామ్ జి గా మార్పు చేసిందన్నారు. అర్హత గల ప్రతికూలికి ఉపాధి కల్పించడంతోపాటు, 125 రోజుల పని దినాలను కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ పథకంలో అర్హత గల ప్రతికూలిని గుర్తించి వారికి పని కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.