కనిగిరి: పట్టణంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డి
కనిగిరి పట్టణంలో రూ.1.18 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృతంలోని కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదలు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి మంత్రులు సూచించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు.