ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : కోణంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ ఎం శ్రీనివాస్ నాయక్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కోణంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల’ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోవిందరాజులు, వెంకటేశులు, యోగేంద్ర చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ, తల్లిదండ్రులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములై విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల పురోగతికి తోడ్పడాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.