కొండపి: సింగరాయకొండ పాకాల సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ సందర్భంగా సందర్శకుల తాకిడి, ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్ రైడ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ ఆదివారం ఆఖరి రోజు కావడంతో సందర్శకులు భారీగా తరలివచ్చారు. కొందరు సముద్రంలో సేదతీరుతో కనిపించగా మరికొందరు బోట్ రైడింగ్ గుర్రపు స్వారి, హెలికాప్టర్ రైడ్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. జన సంద్రోహరంగా మారిన ఈ ప్రాంతంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.