కనిగిరి: ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కు మద్దతు: హనుమంతునిపాడు మాజీ ZPTC వెంకటేశ్వర్లు
హనుమంతునిపాడు: బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ ఈనెల 11న విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కు మద్దతు తెలుపుతున్నట్లు హనుమంతునిపాడు మాజీ జడ్పిటిసి సభ్యులు, సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. బీసీలకు అమరావతిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించాలని బోడె రామచంద్ర యాదవ్ చేస్తున్న డిమాండ్ కు తాము మద్దతు తెలుపుతున్నామన్నారు. రామచంద్ర యాదవ్ విజయవాడలో తలపెట్టిన దీక్షలో పాల్గొనడమే కాకుండా సంపూర్ణ మద్దతు తెలుపుతామని వెంకటేశ్వర్లు తెలిపారు.