రాప్తాడు: కనగానపల్లి మండల కేంద్రంలో స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ కార్యక్రమంలో ఓటర్ వెరిఫికేషన్ నిర్వహించిన బిఎల్వోలు అధికారులు
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం పదిగంటల నుంచి ఐదున్నర గంటల వరకు స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ కార్యక్రమంలో బిఎల్వోలు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాబి ఎల్ ఓ సంజీవ రాయుడు తిరుపాల్ తదితరులు మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు 195వ బూతు 134 స్పెషల్ ఇంటెన్షన్ వెరిఫికేషన్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఓటర్ను వెరిఫికేషన్ నిర్వహించడం జరిగిందని అదేవిధంగా అధికారులు సూచించిన సూచనలు అన్నిటినీ పాటించి ఏ ఒక్క ఓటు పోకుండా అధికారులు అడిగిన అన్ని సమాచారాన్ని ఇవ్వడం జరిగిందని సంజీవరాయుడు తిరుపాల్ తెలిపారు.