కనిగిరి: పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వైసిపి ఇన్చార్జి నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
కనిగిరి పట్టణంలో వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని చర్చి సెంటర్ వద్ద నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ... పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా భారం పడి, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.