కనిగిరి: పట్టణంలో 60 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.37,83,450 లు విలువచేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆపద సమయంలో కార్పొరేట్ వైద్యశాలలో అప్పుచేసి మరి వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్ ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.