రాయదుర్గం: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : డి. హిరేహాల్ తహసీల్దార్
చట్టాలపై ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలని డి.హిరేహాల్ తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. డి.హిరేహాల్ మండలం మురడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధం, మహిళలు, బాలల హక్కులు, ఫోక్సో చట్టం తదితర అంశాలను వివరించారు. హక్కుల ఉల్లంఘన జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.