కనిగిరి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పూర్తిచేసేందుకు మరో 10 రోజులే గడువు: హనుమంతునిపాడు ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు
హనుమంతుని పాడు: ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని బిఎల్వోలు విజయవంతం చేయాలని హనుమంతునిపాడు ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు సూచించారు. హనుమంతునిపాడులో ఆదివారం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం యొక్క ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఎంపీడీవో పరిశీలించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం మరో 10 రోజులు మాత్రమే జరుగుతుందని, బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని బిఎల్ఓ లను ఎంపీడీవో ఆదేశించారు.