కనిగిరి: రఘునాధపురం అచ్చమాంబ ఆలయంలో కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు
పామూరు మండలంలోని రఘునాథపురంలో కొలువైన శ్రీ అచ్చమాంబ ఆలయంలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపానికి రాష్ట్ర టిడిపి కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు. వేద పండితుల నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అన్ని సౌకర్యాలతో కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. పేదలు వివాహాలు జరిపించుకునేందుకు ఈ కళ్యాణ మండపం ఎంతగానో దోహదం చేస్తుంది అన్నారు.