కనిగిరి: పట్టణంలో ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: కనిగిరి వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి పట్టణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాలపై భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ యాదవ్ అన్నారు. కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.... సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై కనిగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి జరుగు నిరసన ర్యాలీ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు