యర్రగొండపాలెం: బోయలపల్లి గ్రామంలో వైసీపీ ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో ను రద్దుచేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.