సంతనూతలపాడు: మద్దిపాడు మండలం దొడ్డవరం లో నిర్వహించిన ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
మద్దిపాడు మండలం దొడ్డవరంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఎడ్లబల ప్రదర్శన పోటీలను నిర్వహించడం అభినందన ఏమని మంత్రి అన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు.