సంతనూతలపాడు: తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ తన కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలను సమర్పించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి 35 అర్జీలు వచ్చాయని, వాటిలో ఇళ్ల స్థలాలు, నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాల కోసం అర్జీలు వచ్చాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.