ఉరవకొండ: SIR సర్వే పేరుతో ఏ ఒక్క అర్హులైన ఓటరు జాబితాల నుండి తొలగకుండా ఉండాలని తహసిల్దార్ కి వైఎస్ఆర్సిపి నాయకులు వినతి
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో SIR సర్వే పేరుతో అర్హులైన ఓటర్ల హక్కుల కు భంగం కలగకుండా ప్రతి ఓటర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం మండల తహసీల్దార్ జయశ్రీ ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అర్హులైన ఏ ఒక్క ఓటర్ కూడా జాబితా నుంచి తొలగించకూడదని తహసిల్దార్ ను కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు డిష్. సురేష్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లెల జగదీష్ bla ల మండల ఇన్చార్జ్ హబీబ్ వజ్రకరూర్ టౌన్ ప్రెసిడెంట్ రవి కాంత్ రెడ్డి లు పాల్గొన్నారు.